దివంగత ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ట్యాంక్‌బండ్ వద్ద కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కాకా సేవలను, పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.
పార్టీలకు అతీతంగా కాకా చూపిన ఆప్యాయత, ప్రేమాభిమానాలే ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కాకా అభిమానులు ఆయనకు నివాళులు అర్పించడం కాకా వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తాను వ్యాపార రంగంలో ఉన్న సమయంలో దత్తాత్రేయ, జానారెడ్డి అందించిన సలహాలు, అండదండలను ఎప్పటికీ మరువలేనని వంశీకృష్ణ తెలిపారు. వేదికపై ఉన్న కేకే, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితర పెద్దల ఆశీస్సులు తనకు చిన్నప్పటి నుంచే లభించాయని గుర్తుచేశారు.
తెలంగాణ కోసం పోరాటం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకా వెంకటస్వామి చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎంపీ అన్నారు. శరీరానికి బుల్లెట్ తగిలినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా అని కొనియాడారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నా ఆఖరి శ్వాస విడుస్తా అని పట్టుదలతో చెప్పిన కాకా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారని వంశీకృష్ణ అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను కాకా చూసి ఉంటే ఎంతో బాధపడేవారని ఆయన వ్యాఖ్యానించారు. కాకా లక్షలాది మంది నిరుపేదలకు, కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇప్పించి అండగా నిలిచారని, అయితే గత పదేళ్లలో జరిగిన భూకబ్జాలు, భూదందాలు, ఇసుక మాఫియాను చూస్తే బాధతో పాటు ఆగ్రహం కలుగుతోందని అన్నారు.
కార్మికుల పెన్షన్,
కాకా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల కోసం తీసుకొచ్చిన పెన్షన్ ఇప్పటికీ కేవలం రూ.500గా ఉండటం శోచనీయమని ఎంపీ పేర్కొన్నారు. కార్మికుల పెన్షన్‌ను రూ.10,000కు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ పార్లమెంట్లో గట్టిగా పోరాడుతున్నామని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం విషయంలో కాకా వెంకటస్వామి, మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోరాడి సుమారు రూ.10 వేల కోట్ల రుణభారం నుంచి సంస్థను బయటకు తీసుకురావడానికి కృషి చేశారని వంశీకృష్ణ గుర్తుచేశారు. ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని, అయితే సరైన నిర్వహణ లేకుండా ఢిల్లీ పెత్తనంతో సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందేలా యాజమాన్యం తీరుపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
యువతకు ఉపాధి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
కాకా ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, () ద్వారా ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలను విస్తరిస్తున్నామని తెలిపారు. కాకా వెంకటస్వామి మరో ముఖ్యమైన కల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అని వంశీకృష్ణ తెలిపారు. ఆదిలాబాద్ ప్రాంతంలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఇటీవల కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో చర్చించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడి జరిగిన నేపథ్యంలో, కాకా కలను సాకారం చేసే దిశగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.











