దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు కుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజు కుమార్ మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లే జాతి నిర్మాతలని అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా, బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం, భారతీయ జనతా పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు కుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజు కుమార్ మాట్లాడుతూ, చిన్నపిల్లలకు ప్రీస్కూల్ విద్య, ఆటపాటలతో బుద్ధి వికాసం కలిగించడంలో, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు అందించడంలో అంగన్వాడీల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఒక వ్యక్తి ఇంజనీర్ గా, డాక్టర్ గా, సైంటిస్ట్ గా, కలెక్టర్ గా ఎదగడానికి అంగన్వాడీలే పునాది అని, వారే జాతి నిర్మాతలని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో అంగన్వాడీలను పోషణ్ అభియాన్ లో భాగం చేసి, వారికి ఇన్సూరెన్స్, స్మార్ట్ ఫోన్లు అందించారని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు తక్కువగా ఉన్నప్పటికీ, వారు తమ సేవలను కొనసాగిస్తున్నారని తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాన్ని పెంచి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో పాటు బిజెపి నాయకులు, మోర్చ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు ముల్కల్లా కుమార్, నరేందర్, రజిత, శ్రావణి, పద్మ, శ్రావణి, ఇతర మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.











