మంచిర్యాల జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, తెలంగాణ మీడియా ప్యానలిస్టు తులా ఆంజనేయులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి ఎదురైన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం, ఏడవడం ఒక అలవాటుగా మారిందని విమర్శించారు.
మంచిర్యాల జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, తెలంగాణ మీడియా ప్యానలిస్టు తులా ఆంజనేయులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి ఎదురైన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం, ఏడవడం ఒక అలవాటుగా మారిందని విమర్శించారు.
గతంలో ఈవీఎంలపై విమర్శలు చేసిన కాంగ్రెస్, ప్రజలు వాటిని నమ్మకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సంఘంపై కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో అధికారం దక్కినప్పుడు ఎన్నికల సంఘం పవిత్రంగా కనిపించిందా, ప్రజలు ఓడించినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందా అని ప్రశ్నించారు. ఇంతకంటే సిగ్గుమాలిన ద్వంద్వ నీతి ఇంకెక్కడా ఉండదని అన్నారు.
ఎన్నికల కమిషనర్ల మధ్య చర్చలు, అంతర్గత సూచనలు స్వతంత్ర ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని సంస్థా చోరీ అని ఆరోపించడం సరికాదని, అదే ముగ్గురు అధికారులు ఏమీ మాట్లాడకుండా సంతకాలు పెడితే రబ్బర్ స్టాంపులు అని విమర్శించేది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ముగ్గురూ ఏకతాటిపై నిలబడి అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నారని ఈసీఐ అధికారిక ప్రెస్ నోట్ స్పష్టం చేసిందని తెలిపారు.
క్యాబినెట్ సెక్రటరీకి రాసిన లేఖ ఈసీఐ పాలసీలకు, ఐటీ విభాగానికి సంబంధించినది కాదని, కేవలం డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారి పనితీరుకు సంబంధించిన సర్వీస్ వ్యవహారమని, డీఈసీ పర్యవేక్షణ ఎన్నడూ తొలగించలేదని ఈసీఐ వాస్తవాలను వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ () అనేది ఓట్ల దొంగతనం కాదని, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లను తొలగించి, ఆర్టికల్ 324 ప్రకారం జాబితాను పవిత్రంగా ప్రక్షాళన చేసే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని వివరించారు.
బోగస్ ఓట్లను, చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అని, దేశ సమగ్రతను తాకట్టు పెట్టి ఆ అక్రమ ఓట్లతోనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 324 కింద చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను, ఫారం-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించి సమర్థించిన తర్వాత కూడా, కోర్టులను లెక్కచేయకుండా అబద్ధాలు ప్రచారం చేయడం న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా అభివర్ణించారు.
మీడియా ముందు గాలిలో పిట్టకథలు చెప్పడం కాదని, రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే రూల్ 20(3)() ప్రకారం కోర్టులో ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేసి మాట్లాడే దమ్ము చూపాలని సవాలు విసిరారు. మెషీన్-రీడబుల్ ఓటర్ లిస్టులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పాత డిమాండ్‌ను సుప్రీంకోర్టు 2019లోనే కొట్టిపారేసినా, పదే పదే అబద్ధాలు వల్లెవేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.











