ఓదెల, 10 October
మండల కేంద్రంఓదెల ఓదెల లో రూ. 26 లక్షల వ్యయంతో చేపట్టిన గ్రామ పంచాయతీ ప్రహరీ గోడ, బతుకమ్మ ఘాట్, సీసీ రోడ్లు వంటి పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంఓదెలలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల వలె ముందుకు సాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
మండల కేంద్రంలో రూ. 26 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల వలె ముందుకు సాగుతున్నాయని, పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
మండల కేంద్రంలో రూ. 26 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ ప్రహరీ గోడ, బతుకమ్మ ఘాట్, సీసీ రోడ్లు ప్రారంభించుకోవడం జరిగిందని, కాంగ్రెస్ సర్కార్ గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని గుర్తు చేశారు.
మండల కేంద్రంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయకూడదని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












