కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు వేములపల్లి సంజీవ్, వనపర్తి రాజేష్, ఇర్ఫాన్, మరియు ఆజర్లు పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపాలిటీ మేయర్, మరియు జలీల్, అర్కల హేమలతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు వేములపల్లి సంజీవ్, వనపర్తి రాజేష్, ఇర్ఫాన్, మరియు ఆజర్లు పాల్గొని పలు అంశాలపై ఘాటుగా స్పందించారు.
రామగిరి బానేష్ అవినీతి ఆరోపణలు
మాజీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ సాగిస్తున్న అవినీతి, అక్రమ వ్యవహారాలను బహిర్గతం చేశారు. రామగిరి బానేష్ అవినీతిని ఆయన ఎండగట్టారు.
మేయర్ నిరంకుశ పోకడలపై విమర్శలు
నాయకుడు వనపర్తి రాజేష్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో మేయర్ సాగిస్తున్న నిరంకుశ పోకడలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. పాలనలో మహిళా కార్పొరేటర్ల పట్ల చూపిస్తున్న వివక్షను, అలాగే దళిత కార్పొరేటర్ల పట్ల అవలంబిస్తున్న అనుచిత వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. మేయర్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జలీల్‌పై కట్టప్ప వ్యాఖ్యలు
మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఉప్పలయ్యపై జలీల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నిరాధార వాక్యాలను తప్పుపట్టారు. జలీల్‌కు రాజకీయ భవిష్యత్తును, రాజకీయ భిక్షను అందించింది ఉప్పలయ్యేనని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిపైనే అవాకులు చవాకులు పేలుస్తూ వెన్నుపోటు పొడిచిన కట్టప్పలా జలీల్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
నాయకుడు అజర్ మాట్లాడుతూ, మంథని జగన్మోహన్ రావుపై అర్కల హేమలత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఆమె ఎదుర్కొన్న ఓటమికి పూర్తిగా ఆమె స్వయంకృతమే కారణమని, ఆ నెపాన్ని ఇతరులపై నెట్టడం తగదని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి నిరాధార, అనుచిత ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.











