మంచేరియల్, 10 September
పేదల భూములను దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం 22 నిషేధిత భూముల జాబితా తెచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాబితా నుండి పట్టా ఉన్న భూములను తొలగించాలని డిమాండ్ చేశారు.
*పేదల భూములు దోచుకోవడానికే 22A నిషేధిత భూముల జాబితా తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* *కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకవచ్చిన 22A నిషేధిత భూముల జాబితా నుండి పట్టా ఉన్న నివాస మరియు వ్యవసాయ భూములు జాబితా తొలగించాలని కోరుతూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు బిజెపి నాయకులు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విధంగా 22 A నిషేధిత జాబితాలో ఉన్న బాధితుల నుండి స్వీకరించిన దరఖాస్తులను కలెక్టర్ గారికి రఘునాథ్ గారు అందజేయడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ పేద ప్రజల భూములు దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం 22A జాబితా తీసుకవచ్చింది అని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో లేదా మరియు మధ్య తరగతి ప్రజల భూములు లేకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత భూముల భూముల జాబితాలో చేర్చింది అని అన్నారు. MLA ప్రేమ్ సాగర్ రావు 22A లో ఒక్కరి పేరు ఉన్న రాజీనామా చేస్తామని చెప్పిన మాట ప్రకారం నియోజకవర్గంలో 22A లో ఉన్న జాబితా ను తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22A జాబితాలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. 22A భూ బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, గడ్డం స్వామి రెడ్డి, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, నందుర్క సుగుణ, మొరుపుటల సంజీవ్, బెడద సురేష్, కొండ వెంకటేష్, పతిపాక సంతోష్, గడికొప్పుల సురేందర్, బత్తుల శేఖర్, ఎంబడి సురేందర్, ముత్తె అనిల్, చుంచు గిరిధర్, ముత్తె వెంకటేష్, దార శేఖర్, దుమ్మని సత్తయ్య, అక్కల దివ్య, నల్ల రవి, మంద రాజేందర్, రాకేష్ రెన్వ, బొంగొని శ్రీనివాస్, కొట్టే ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు








