మంచేరియల్, 2026-08-20
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే చర్యలలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు.
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
అదనంగా నిర్మిస్తున్న గదులు, భోజనశాల పనులను త్వరగా పూర్తి చేయాలని, వంటశాలలు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పోషకాహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, విద్యార్థుల గైర్హాజరును ప్రతిరోజు పర్యవేక్షిస్తూ, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీ, వి.ఓ. భవనాల పరిశీలన
మండలంలోని పల్లంగూడ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, నూతనంగా నిర్మిస్తున్న వి.ఓ. భవనాల పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామంలోని డంప్ కంపోస్ట్ పిట్‌ను పరిశీలించి, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సాగు
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న శాశ్వత కూరగాయల పందిరి సాగును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాళ్లపల్లి మౌనిక యూనిట్లో చేపట్టిన ఈ సాగుకు యూనిట్ వ్యయం 2 లక్షల 50 వేల రూపాయలు కాగా, ఉద్యానవన శాఖ ద్వారా 1 లక్ష రూపాయల రాయితీ అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఇలాంటి ఆధునిక సాగు పద్ధతులను వినియోగించుకుని అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు, ప్రాథమిక సౌకర్యాల పరిశీలన
గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె దవాఖాన/ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, హాజరు, బోధన విధానంపై వివరాలు తెలుసుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు












