Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 12
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామ సమీపంలో కొలువైన శ్రీ గట్టు మల్లన్న స్వామి వారి 23వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం రేపు, అనగా 13-07-2026 సోమవారం, ఆరుద్ర నక్షత్రం రోజున జరగనుంది. ఈ ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామ సమీపంలోని గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ గట్టు మల్లన్న స్వామి వారి 23వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం, ఆరుద్ర నక్షత్రం రోజున ఈనెల 13-07-2026 సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరాం మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఉదయం 8:00 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పాండవులు ప్రతిష్టించిన స్వామి దర్శనం కోసం చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్ నుండి ఉదయం 7:00 గంటలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. కావున హిందూ బంధువులందరూ సకాలంలో హాజరై గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గిరి ప్రదక్షిణ సభ్యులు కోరారు. వివరాలకు 98490 30370, 9866361654 నంబర్లలో సంప్రదించవచ్చు.












