మంచేరియల్, 2026-06-05
మంచిర్యాల టీఎన్జీవో భవన్లో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. సెప్టెంబర్ 30లోపు సభ్యత్వం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల టీఎన్జీవో భవన్లో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగులందరూ సెప్టెంబర్ 30 లోపు సభ్యత్వం తీసుకుని, రాష్ట్రంలోనే మొదటి 100 శాతం పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు, డిమాండ్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపు ఆరువేల కోట్లు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్గానికి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని (ముజీబ్)లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో, పెండింగ్‌లో ఉన్న 6 లను వెంటనే విడుదల చేయాలని, ని వెంటనే అమలు చేయాలని, ను తొలగించి ను అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల హెల్త్ కార్డును కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని, మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినందున కార్పొరేషన్ పరిధిలో పనిచేసే వారందరికీ 17 హెచ్ఆర్ఏ ఇవ్వాలని, మిగిలిన ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో జిల్లా సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు ఉంటాయని తెలిపారు.
శ్రీపతి బాపురావు సన్మానం
తదుపరి, జైపూర్ ఎంపిడిఓగా ఇటీవల అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీ శ్రీపతి బాపురావును జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ఉపాధ్యక్షుడి నియామకం
జిల్లా కమిటీలో ఏర్పడిన క్యాజువల్ వేకెన్సీతో ఖాళీ అయిన ఉపాధ్యక్ష పదవికి కో-ఆప్షన్ పద్ధతిలో నడిమెట్ల సత్యనారాయణను ఎన్నుకున్నారు. తదుపరి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ సమావేశంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, కోశాధికారి శ్రీ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, అంజయ్య, తిరుపతి, రామ్ కుమార్, నరేందర్, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, పద్మలత, స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, లక్షెట్టిపెట్ యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ కార్యదర్శి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.










