జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తమిళనాడు ప్రభుత్వ అధికారులు ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా తప్పించుకుంటున్నారని వారు ఆరోపించారు. ఆలయ ట్రస్టు బోర్డు తీర్మానాన్ని సాకుగా చూపుతూ అధికారులు బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత విచారణ కేవలం కోర్టు ధిక్కరణ జరిగిందా లేదా అనే దానిపైనే దృష్టి సారిస్తుందని, ప్రధాన వివాదంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఈ వ్యవహారంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా () తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం తీవ్రమైన ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలను విన్న తర్వాత, జస్టిస్ కుమార్ ;ఇవి నిజమైన కన్నీళ్లా లేక మొసలి కన్నీళ్లా; అని వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఆలయ ట్రస్టీలకు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదని, దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలన్న ఆదేశాలను యథాతథంగా అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.






