రామగుండం, 12.07.2026
సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం, ముఖ్యంగా మెడికల్ బోర్డు కొనసాగింపు డిమాండ్‌తో జూలై 20వ తేదీన రామగుండంలో కుటుంబ సభ్యులతో కలిసి 'వంటావార్పు - నిరవధిక నిరాహార దీక్ష' చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ (HMS), తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రకటించారు. కవిత గారి నాయకత్వంలో ఇటీవల చేపట్టిన 'బాయి బాట' కార్యక్రమం విజయవంతమైందని వారు తెలిపారు.
సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీన రామగుండంలో కుటుంబ సభ్యులతో కలిసి 'వంటావార్పు - నిరవధిక నిరాహార దీక్ష' చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ (HMS), తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రకటించారు. కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఇటీవల చేపట్టిన 'బాయి బాట' కార్యక్రమం 100% విజయవంతమైందని వారు తెలిపారు.
మెడికల్ బోర్డు కొనసాగింపు మరియు మారుపేర్ల (అలియాస్ నేమ్స్) సమస్యల తక్షణ పరిష్కారం; టెన్త్ పాస్ కాలేదనే సాకుతో ఆపిన వారసత్వ ఉద్యోగాల మంజూరు; "సొంతఇంటిపధకం" కింద హౌసింగ్ బోర్డ్ సొసైటీ ఏర్పాటు మరియు పారదర్శక ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని వారు కోరుతున్నారు.
కార్మికుల పక్షాన నిలబడాల్సిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు యాజమాన్యానికి, అధికార పార్టీకి బ్రోకర్లుగా మారారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రధాన సమస్యలను పక్కనపెట్టి, 40 డిమాండ్లతో వారు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రైవేట్ వేలంపాటను అడ్డుకుని, తమ నిరంతర పోరాటం వల్లే 'తాడిచెర్ల-2' ప్రాజెక్టు సింగరేణికే దక్కేలా చేశామని గుర్తుచేశారు.
సింగరేణి యాజమాన్యానికి మరో 7 రోజుల సమయం మాత్రమే ఉందని, 20వ తేదీ లోపు మెడికల్ బోర్డుపై అధికారిక ప్రకటన చేయకపోతే కవితక్క నాయకత్వంలో కార్మికులంతా ప్రత్యక్ష పోరాటానికి (హంగర్ స్ట్రైక్) దిగి యాజమాన్యం మెడలు వంచుతామని నాయకులు హెచ్చరించారు. Facebook, WhatsApp లో ప్రేక్షకపాత్ర వహించకుండా కార్మికులంతా రామగుండం చేరుకుని దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో HMS రియాజ్ అహ్మద్, జనరల్ సెక్రెటరీ, గోశిక అశోక్ గారు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, వెంకట్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, కిరణ్ ఆర్ జి వన్ జి-1 చీఫ్ వైస్ ప్రెసిడెంట్, క్రాంతి కుమార్ బ్రాంచ్ సెక్రటరీ సెక్రటరీ rg -1, సతీష్ జాయింట్ సెక్రెటరీ, గోస్క శ్రీకాంత్ br సెక్రెటరీ Rg -3, SK వలి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, పిట్ సెక్రటరీలు చందర్, రామ్ చరణ్, మహేందర్, రాజశేఖర్, విష్ణు, రాజేష్, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.











