మంచేరియల్, ఆదివారం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శేట్పల్లి గ్రామంలో ఆదివారం మధున పోశమ్మ బోనాల పండుగను గ్రామస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో అలంకరించిన బోనాలను తలపై మోసుకుని డప్పు వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
జైపూర్ మండలంలోని శేట్పల్లి గ్రామంలో ఆదివారం మధున పోశమ్మ బోనాల పండుగను గ్రామస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో అలంకరించిన బోనాలను తలపై మోసుకుని డప్పు వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతంరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, కుటుంబాల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, గ్రామ ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గ్రామస్థులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.












