నస్పూర్, 2026-08-18
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్ పాండే లతో కలిసి హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పాపన్న గౌడ్ ఆశయాలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కష్టపడి పనిచేసి చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. మనమంతా ఐక్యంగా ఉన్నంతకాలం అభివృద్ధి వైపు ముందుకు సాగగలుగుతామని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ద్వారా ఆత్మవిశ్వాసం, సమష్టి కృషి ఉంటే మంచి ఫలితాలను సాధించవచ్చనే సందేశం తెలుస్తుందని, పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
మహానుభావుల జయంతి వేడుకలు
మహానుభావుల ఆశయాలు, ఆచరణాత్మక పద్ధతులు భావితరాలకు తెలిసే విధంగా మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వెనుకబడిన తరగతులు, గౌడ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.










