మంచేరియల్, 10-07-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎంటీవో కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు, వాహనాల పార్కింగ్, బ్యారక్ల పరిశుభ్రతపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని ఎంటీవో కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంటీవో కార్యాలయ పరిసరాలను పరిశీలించిన ఆయన, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యాలయ ఆవరణ, పోలీసు వాహనాల పార్కింగ్ ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు, ప్రభుత్వ వాహనాల నిర్వహణ, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యాలయ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, పరిశుభ్రమైన వాతావరణం సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.











