విడపనకల్, 2026-06-05
పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయ బృందంతో కలిసి పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ విద్యా యాత్రలో భాగంగా విద్యార్థులు పంటల సాగు విధానం, విత్తనాల ఎంపిక, నీటి వినియోగం, నేల ప్రాముఖ్యత, రైతుల శ్రమ వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయ బృందంతో కలిసి పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ విద్యా యాత్రలో భాగంగా విద్యార్థులు పంటల సాగు విధానం, విత్తనాల ఎంపిక, నీటి వినియోగం, నేల ప్రాముఖ్యత, రైతుల శ్రమ వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించింది.
ప్రత్యక్ష అనుభవం
విద్యార్థులు కేవలం పరిశీలించడమే కాకుండా, స్వయంగా నారు మోయడం, నాట్లు వేయడం వంటి పనుల్లో పాల్గొన్నారు. పుస్తకాల్లో చదివిన విషయాలను క్షేత్రస్థాయిలో చూసి తెలుసుకోవడం ద్వారా వారిలో ఆసక్తి పెరిగిందని, ప్రశ్నించే తత్వం, పరిశీలనా నైపుణ్యాలు మెరుగుపడ్డాయని ఉపాధ్యాయులు తెలిపారు.
అభ్యసన ఫలప్రదం
అనుభవపూర్వక అభ్యసనం ద్వారా విద్యార్థుల జ్ఞానం ఫలప్రదం అవుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రాజేశం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాతతో పాటు పలువురు రైతులు కూడా పాల్గొన్నారు.












