Hanumakonda/Elkathurthi (ప్రజావార్త) నవంబర్ 26
ఎల్కతుర్తి వివేకానంద పురుషుల పొదుపు సంఘం వడ్లకొండ రాజు కుటుంబానికి ఇన్సూరెన్స్ ఆర్థిక సాయం అందజేసింది, మొదటి విడతగా రూ. 80,000 నగదును అందించారు.
ఎల్కతుర్తి వివేకానంద పురుషుల పొదుపు సంఘం ఆధ్వర్యంలో వడ్లకొండ రాజు (తండ్రి సారయ్య) కుమార్తె రవళికి పొదుపు సంఘం తరఫున ఇన్సూరెన్స్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, మొదటి విడత కింద రూ. 80,000 నగదును బాధితురాలికి అందజేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. అనంతరం, రెండవ విడత కింద యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా మరో రూ. 2 లక్షలు అందనున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. పురుషుల పొదుపు సంఘంలో సభ్యులుగా ఉన్నవారు తాము చెల్లించవలసిన నెలవారీ వాయిదాలను మరియు బకాయిలను క్రమం తప్పకుండా సకాలంలో చెల్లించాలని సూచించారు. డబ్బులు సకాలంలో చెల్లించే సభ్యులకు ఇలాంటి ఆపద సమయాల్లో సాధారణ బీమా (ఇన్సూరెన్స్), ఇతర ప్రభుత్వ, సంఘ సంక్షేమ పథకాల సౌకర్యాలు పూర్తిస్థాయిలో వర్తిస్తాయని వారు స్పష్టం చేశారు.
ఆపద సమయంలో పొదుపు సంఘాలు సభ్యుల కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద పురుషుల పొదుపు సంఘం సమితి అధ్యక్షులు కంచర్ల కృష్ణమూర్తి, అధ్యక్షులు డా. ప్రభాకర్, ఉపాధ్యక్షులు రమేష్, సంఘం సభ్యులు శీలం అనిల్ కుమార్, నాగరాజు, చంద్రమౌళి, రవి సార్, అల్లి కిరణ్, వెల్డింగ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.







