సారాంశం
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ కొత్త సత్తయ్యను ప్రజా జాగృతి సమిత...
ముఖ్య విషయాలు
- 1న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు, న్యాయవాదుల సంక్షేమానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
- 2న్యాయవాది కొత్త సత్తయ్యకు ప్రజా జాగృతి సమితి సన్మానం
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ కొత్త సత్తయ్యను ప్రజా జాగృతి సమితి ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.
- 3ఈ సందర్భంగా ప్రజా జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడుతూ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతూ రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం మంచిర్యాల న్యాయవాదులకు గర్వకారణమని అన్నారు.
- 4ఈ సందర్భంగా కొత్త సత్తయ్యకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ కొత్త సత్తయ్యను ప్రజా జాగృతి సమితి ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రజా జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడుతూ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతూ రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం మంచిర్యాల న్యాయవాదులకు గర్వకారణమని అన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు, న్యాయవాదుల సంక్షేమానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కొత్త సత్తయ్యకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా జాగృతి సమితి మంచిర్యాల పట్టణ అధ్యక్షులు ఆడెపు సురేందర్, ప్రతినిధులు, న్యాయవాద మిత్రులు పాల్గొన్నారు.