Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 24
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి చేసిన వారిపై విచారణ జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని PDSU విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు చెన్నూర్ పట్టణంలో విద్యాసంస్థల బంధు కార్యక్రమాన్ని నిర్వహించారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి, యువతపై విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణ కేంద్రంలో విద్యాసంస్థల బంధు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ కుంభకోణం వలన 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే వరుసగా జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన పరీక్షల పేపర్లు లీకేజీలు అవుతున్నాయని, విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థి యువత పట్ల కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. శాంతియుతంగా జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థి యువతపై విచక్షణారహితంగా కేంద్ర ప్రభుత్వం పోలీసులచే లాఠీ చార్జీలు, భాష్ప వాయుగోళాలు, వాటర్ కెనాన్లు ప్రయోగించి ఇష్టానుసారంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని తెలిపారు.
విద్యార్థి యువతపై దాడికి పాల్పడిన వారిపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU తదితర విద్యార్థులు పాల్గొన్నారు.












