మంచేరియల్, 2026-11-26
మంచిర్యాల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రీమతి అర్కాల హేమలత నియామకం పట్ల శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఈ నియామకం పట్ల పలు బీసీ సంఘాలు కూడా తమ సంతోషాన్ని తెలియజేశాయి.
మంచిర్యాల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రీమతి అర్కాల హేమలత నియామకం పట్ల శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు, బీసీ సంఘం నాయకులు గజేల్లి వెంకటయ్య మాట్లాడుతూ, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శ్రీమతి హేమలత విద్యార్థి దశ నుండే అన్యాయాన్ని ప్రశ్నించే మనస్తత్వం కలిగి ఉన్నారని తెలిపారు. రైతులు, రైతు కూలీలు, మహిళల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ, పురుషులకన్నా మహిళలు ఎందులో తక్కువ కాదన్నట్లు మహిళా నాయకురాలిగా అంచెలంచెలుగా ఎదుగుతూ, కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా, గ్రామ సర్పంచిగా, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎదిగారని పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాత్రనక పగలనక కష్టపడుతున్న పద్మశాలీలకు, బీసీలకు ఆశాకిరణమైన శ్రీమతి అర్కాల హేమలతను మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారికి, మంచిర్యాల్ ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు గారికి, డిసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కె సురేఖ మేడం గార్లకు, తెలంగాణా పద్మశాలి సంఘం మరియు బీసీ సంఘాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.







