Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 15
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో గల ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలోని సదుపాయాలు, సిబ్బంది హాజరు, మందుల స్టాక్, వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో గల ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని సదుపాయాలు, సిబ్బంది హాజరు, మందుల స్టాక్, వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. జాతీయ ప్రమాణాల మేరకు కేంద్రాన్ని తీర్చిదిద్దాలని స్థానిక సర్పంచ్, వైద్యాధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి బుధవారం, శనివారం నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాలను అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఆదేశించారు.











