మంచేరియల్, 22/7/26
మందమర్రి పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయంలో ఆషాడ గుప్త నవరాత్రులలో భాగంగా వారాహి నవరాత్రులు ఎనిమిదవ రోజు పురస్కరించుకొని వైభవంగా వేడుకలు జరిగాయి. కుల సంప్రదాయాల ప్రకారం వారాహి దేవికి విశేష అభిషేక అలంకరణ, యంత్ర పూజ, మంత్ర వారాహి యాజ్ఞం నిర్వహించారు.
మందమర్రి పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయంలో ఆషాడ గుప్త నవరాత్రులలో భాగంగా వారాహి నవరాత్రులు ఎనిమిదవ రోజు పురస్కరించుకొని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కుల సంప్రదాయ విధానాలను అనుసరించి వారాహి దేవికి విశేష అభిషేక అలంకరణ, యంత్ర పూజ, మంత్ర వారాహి యాజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం, తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు.
మహా మంగళ నీరాజనం అనంతరం, దేవాలయ సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. గోవు సమక్షంలో 40 మంది సంతకాల సేకరణ మహోత్సవంలో భాగంగా గోవు సమక్షంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీ కుల పీఠం శ్రీ శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాక్షి దేవాలయం ఆధ్వర్యంలో చేపట్టారు.












