మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత ఎం.డి. మునీర్ రచించిన పుస్తకాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.
సిఆర్ క్లబ్లో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా విశేష సేవలు అందిస్తోందని అన్నారు.
జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న ఎం.డి. మునీర్ అభినందనీయులని మంత్రి పేర్కొన్నారు.
రచయితగా కూడా తన ప్రతిభను చాటుకుంటూ, పుస్తక రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను అందించడం ప్రశంసనీయమని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు, అభిమానులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.












