మంచిర్యాల జిల్లా నూతన ట్రెజరీ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రమేష్ గారికి తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు నూతన అధికారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా, జిల్లాలో ట్రెజరీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో నూతన అధికారి తమదైన ముద్ర వేయాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి రాంకుమార్, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసఫ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తమను గౌరవించిన టీఎన్జీవో ప్రతినిధులకు శ్రీ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన విధి నిర్వహణలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు.