మంచిర్యాల జిల్లా నూతన రెవెన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ మోతి రామ్ గారిని, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి నేతృత్వంలో సంఘం నాయకులు, కార్యకర్తలు నూతన అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా, జిల్లా రెవెన్యూ కార్యాలయ పనితీరు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిగింది. శ్రీ మోతి రామ్ తన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు.
సన్మాన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి రాంకుమార్, సంయుక్త కార్యదర్శి సునీత, యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీలైన అజయ్, మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తామని నూతన అధికారికి హామీ ఇచ్చారు.












