మంచిర్యాల జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంచిర్యాల కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
మైనారిటీ విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి, RLC, అకాడమిక్ కోఆర్డినేటర్, విజిలెన్స్ ఆఫీసర్, పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. విద్యార్థులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.












