మంచేరియల్, 2026-06-29
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి, సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ ను సస్పెండ్ చేయాలని కమీషనర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, శ్రేణులు ధర్నా చేపట్టారు. కార్పొరేషన్ లో కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని బీజేపీ ఆరోపించింది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యలపై గళం విప్పారు. కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై మాట్లాడే గొంతులను నొక్కేయడానికి మేయర్ ముఖేష్ గౌడ్ గారిని కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయాలని కమీషనర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిరంకుశ పాలనను నిరసిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు, శ్రేణులు మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్, ముఖేష్ గౌడ్ లు మాట్లాడుతూ, మంచిర్యాల కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి, సమస్యలపై మాట్లాడితే కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డు తగులుతూ, ప్రశ్నించే బీజేపీ గొంతులను అణచివేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ లో ఏ డివిజన్ చూసుకున్నా నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. పట్టణ సమస్యలపై ప్రశ్నించిన ముఖేష్ గౌడ్ గారిని సస్పెండ్ చేయడం అమానుషమని వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. కార్పొరేషన్ లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రజలు కట్టిన పన్నుల వలనే జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. మహా ప్రస్థానం నిర్మాణానికి 4 కోట్ల కేంద్ర నిధులు, స్వచ్ఛమైన త్రాగునీటికి అమృత్ 2.0 పథకం కింద నిధులు, చెరువుల పునరుద్ధరణకు కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. కమీషనర్ కు వినతి పత్రం అందజేస్తే తీసుకోకపోవడం సిగ్గుచేటని, అవినీతిపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత, పెద్దపల్లి పురుషోత్తం, కృష్ణ మూర్తి, పట్టి వెంకట కృష్ణ, బియ్యాల సతీష్ రావు, మొటపలుకుల తిరుపతి, ఆకుల అశోక్ వర్ధన్, జోగుల శ్రీదేవి, జయరామ రావు, సత్రం రమేష్, అమిరిశెట్టి రాజ్ కుమార్, వైద్య శ్రీధర్, కొయ్యడ పద్మ, పచ్చ స్వప్న రాణి మరియు తదితరులు పాల్గొన్నారు.












