ఖమ్మం జిల్లాకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని, మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో నివాసం ఉంటున్న ఆమె గర్భవతి అనే విషయం కుటుంబ సభ్యులకు గానీ, కళాశాల సిబ్బందికి గానీ తెలియకపోవడం గమనార్హం. బుధవారం నాడు బాత్రూమ్లో ఆమెకు ప్రసవం జరిగినట్లు సమాచారం.
ఈ విషయం తెలిసిన వెంటనే తోటి విద్యార్థినులు, కళాశాల సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అధికారులు, విద్యార్థినిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
పోలీసులు విద్యార్థిని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె మైనర్‌గా ఉన్న సమయంలోనే ఈ సంబంధం ఏర్పడిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన కళాశాల యాజమాన్యం, విద్యార్థినుల్లో తీవ్ర కలకలం రేపింది. హాస్టల్లో ఇలాంటి సంఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.






