జైపూర్ పోలీసులు ఇందారం ఎక్స్ రోడ్డులో నాకాబందీ నిర్వహించారు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జైపూర్ పోలీసులు ఇందారం ఎక్స్ రోడ్డులో నాకాబందీ నిర్వహించారు.
సీఐ జైపూర్ మరియు ఎస్ఐ-II జైపూర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు అనుమానిత వ్యక్తులు మరియు వాహనాలను గుర్తించి విచారిస్తున్నారని పేర్కొన్నారు.












