మంచిర్యాల () నవంబర్ 20
మంచిర్యాల జిల్లా హాజీపూర్ ఎంపిడిఓ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోలో సభ్యత్వం స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
{"heading":null,"text":"హాజీపూర్ ఎంపిడిఓ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ హాజీపూర్ ఎంపిడిఓ కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు.\nఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టిఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ఇంకా మిగిలిన యూనిట్లలో సభ్యత్వ నమోదును అతి తొందరలోనే పూర్తి చేసి, రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు.\nఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు నరేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, పంచాయతీ రాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు."}







