హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో జరిగిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై మార్గదర్శనం చేశారు. ఇతర ఎంపీలు, డీసీసీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, బూత్ స్థాయిలో కేడర్‌ను చురుకుగా పనిచేయించేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని, పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
‘సంఘటన్ సృజన్ అభియాన్’ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ కార్యకలాపాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.










