మంచేరియల్, జూలై 14, 2026
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. మంగళవారం హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం తహసీల్దార్‌తో కలిసి హాజీపూర్ మండలం నమ్నూర్ గ్రామంలోని 123, 124, 125 నంబరు పోలింగ్ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులు (BLOలు)తో మాట్లాడి ఇంటింటి సర్వే, వివరాల నమోదు, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పనులను వేగవంతంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితత్వంతో నమోదు చేయడంతో పాటు ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











