మంచేరియల్, 2026-07-29
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను బి.ఎల్.ఓ. సూపర్వైజర్లు, ఏ.ఈ.ఆర్.ఓ.లు, ఈ.ఆర్.ఓ.లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.
అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను నియమ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 ఓటర్లకు మించి ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు కలిగి ఉండేలా హేతుబద్దీకరణను చేపట్టాలని తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, వాటికి సంబంధించిన వివరాలు డాక్యుమెంటేషన్ చేయాలని, ఎ.ఎస్.డి. జాబితా తయారు చేసిన తరువాత సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యువరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 81 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సమన్వయంతో ప్రక్రియ వేగవంతానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలయత్ అలీ, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












