మంచేరియల్, 2026-06-29
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మందమర్రి, మామిడిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో అందిస్తున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఇంటింటి తనిఖీలను పర్యవేక్షించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మామిడిగూడ ఉపకేంద్రాలలో అందిస్తున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీ చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కాసిపేట మండలంలోని మామిడిగూడ గ్రామంలో ఉపకేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను, ఇంటింటికి తిరిగి ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ఇళ్లలో తనిఖీలను ఆయన పర్యవేక్షించారు. అందిస్తున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం, 30 ఏళ్లు పైబడిన వారికి అసంక్రమణ వ్యాధుల పరీక్షలు చేయడం, ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు, సరైన సమయంలో మందులు అందజేయడం, డయాబెటిస్, బీపీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు.
క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా రోగులను గుర్తించి నిశ్చయ్ పోర్టల్ లో నమోదు చేయాలని, పోషకాహారం కోసం వ్యాధిగ్రస్తులకు ఎన్జీవోలను గుర్తించాలని సూచించారు. ఫోర్ టేబుల్ ఎక్స్‌రే మిషన్ ద్వారా పరీక్షలు చేయాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భవతుల నమోదు, వైద్యాధికారి ద్వారా నాలుగు విడతల పరీక్షలు చేయించడం, ప్రతి వివరములను మాతా శిశు సంరక్షణ కార్డులో నమోదు చేయడం, హై రిస్క్ గర్భవతుల వివరాలను వైద్యాధికారి వద్ద ఉంచుకోవాలని, సాధారణ ప్రసవాల కోసం తల్లులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో ప్రసవాలు తల్లి బిడ్డలకు క్షేమమని, అన్ని రకాల వ్యాక్సినేషన్లను సరైన సమయంలో అందించాలని సూచించారు. జిల్లాలో 14 సంవత్సరాలు నిండిన బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందజేయాలని, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్‌ను ఆడపిల్లలకు ఇప్పించాలని, అవగాహన కలిగించాలని ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధులు, దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులను అరికట్టడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.











