Mancherial/Kasipet (ప్రజావార్త) జూలై 30
దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్‌లో భారీ వర్షాల కారణంగా సయ్యద్ బాబా గారి ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో వృద్ధురాలైన ఆయన తల్లిగారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని 12వ వార్డు రాంపూర్‌లో భారీ వర్షాల కారణంగా సయ్యద్ బాబా గారి ఇల్లు కూలిపోయింది. ఈ సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో వృద్ధురాలైన ఆయన తల్లిగారు ఉండగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది.
ఇల్లు కూలిపోయిన విషయాన్ని స్థానికులు వెంటనే 12వ వార్డు సభ్యులు షేక్ నసీమ షఫీ గారికి తెలియజేయగా, వారు తక్షణమే స్పందించి గ్రామ సర్పంచ్ శ్రీ సిడం రామదాస్ గారికి, గ్రామపంచాయతీ కార్యదర్శి కవిత మేడం గారికి సమాచారం అందించారు. అనంతరం సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, దేవాపూర్ పోలీసు SI గంగారం గారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
వృద్ధురాలి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర సహాయంగా దుస్తులు, స్వెటర్, దుప్పటి అందజేయడంతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.









