పెద్దపల్లి, 2026-07-24
పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణా రావుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించిన సందర్భంగా, ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయరమణా రావు గారికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించిన సందర్భంగా, శివపల్లిలోని ఎమ్మెల్యే విజ్జన్న గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి, చేతికి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాల్వశ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజనవేన సదయ్య గౌడ్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, ఆశన్న పల్లి సర్పంచ్ గాజుల మోహన్, శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మదాసి సతీష్, పందిల్ల మాజీ ఎంపీటీసీ రావి సదానందం తదితరులు పాల్గొన్నారు.











