Andaman and Nicobar Islands, 12 September
మంచిర్యాల జిల్లా టీపీసీసీ ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన నాగుల రాజ్‌కుమార్‌ను నియమించారు. టీపీసీసీ ఎస్సీ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఈ నియామకాన్ని ప్రకటించారు.
ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగుల రాజ్‌కుమార్ ఫోటో: నాగుల రాజ్ కుమార్ మంచిర్యాల: మంచిర్యాల జిల్లా టీపీసీసీ ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన నాగుల రాజ్‌కుమార్‌ను నియమించినట్లు టీపీసీసీ ఎస్సీ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల రాజ్ కుమార్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ పదవీ ని అప్పగించినందుకు మంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గ ప్రజల సమస్యలపై పోరాడుతానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆయనను కుల బంధువులు, రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు, పలువురు ఘనంగా సన్మానించారు.










