సిపిఐ (ప్రజావార్త) నవంబర్ 18
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న బియ్యం, పప్పులు, కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. పేదవారు తినే బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అదేవిధంగా రైతులు పండించిన వరి ధాన్యానికి సరైన ధర లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పప్పులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని పేర్కొన్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే రేషన్ షాపుల ద్వారా ప్రజలకు గోధుమ, నూనె, చక్కెర, ఉప్పు, పప్పులు, సబ్బులు వంటి 12 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఊటుకూరి రాములు, కర్రే లక్ష్మణ్, గోపాల్పూర్ సర్పంచ్ కర్రె లక్ష్మి, జిల్లా సమితి సభ్యులు మరి శ్రీనివాసు, మండల సహాయ కార్యదర్శి మర్రి విజయ్, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్, రై సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టేముక్కుల మనోహర్రావు, నాయకులు సూర మొగిలి, ఎం మల్లయ్య, జూపాక రవీందర్, ఊటుకూరి బిక్షపతి, బోయినపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.







