ఎల్కతుర్తి, 17 November
హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో నూతన పింఛను లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది.
హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో నూతన పింఛను లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. పెన్షన్లు పొందిన వారికి శుభాకాంక్షలు.
తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అర్హులైన పేదలకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి అక్కాచెల్లెళ్లందరినీ కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ నెల 19న సిద్దిపేటలో చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వృత్తుల వారికి ఉచితంగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం ప్రారంభించనున్నట్లు, గతంలో రైతులకే పరిమితమైన బీమాను రాష్ట్రంలోని అన్ని వృత్తుల వారికి వర్తింపజేస్తున్నామని తెలిపారు. గత పదేళ్ల అప్పుల భారం ఉన్నప్పటికీ పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను అమలు చేస్తున్నామని, అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్లు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
మండలంలో ఇప్పటికే 5,850 మందికి నెలవారీ పెన్షన్లు మంజూరు కాగా, తాజాగా మరో 715 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 5230 పింఛన్లు కొత్తగా మంజూరు అయ్యాయని, ప్రజా పాలన ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
కొత్తగా మంజూరైన పెన్షన్లలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు, 53,844 మంది ఒంటరి మహిళలు ఉన్నారని తెలిపారు. పెన్షన్ వెరిఫికేషన్‌లో లోపాలు ఉంటే ప్రత్యేక అధికారులతో 380 కోణాల్లో పరిశీలన చేయాలని ఆదేశించినట్లు, అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడూ పెన్షన్‌కు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మండలంలో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాల కోసం రేపు ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, ఈవీ వాహనాలు, వినికిడి యంత్రాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు.







