ఆదిలాబాద్, 16 November
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఏల్పుల రవీందర్‌ను బహుజన సాహితి అకాడమీ నేషనల్ కమిటీ ఉత్తమ కార్పొరేటర్‌గా ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచి, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను బహుజన సాహితి అకాడమీ నేషనల్ కమిటీ వారు ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్‌ను ఉత్తమ కార్పొరేటర్‌గా ఎంపిక చేసింది. నిన్న ఢిల్లీలోని కరూర్ బాగ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏడవ డివిజన్ కార్పొరేటర్ రవీందర్ మాట్లాడుతూ, తనకు ప్రకటించిన ఈ అవార్డు పూర్తిగా గౌరవనీయులైన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, మేయర్ ధరణి మధుకర్ గారి సహాయ సహకారాలతో పాటు 7వ డివిజన్ ప్రజల సహకారంతో దక్కిందని తెలిపారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ధనిక, పేద, కులం, మతం అనే భేదం లేకుండా అందరికీ సమానత్వంతో సేవలు అందిస్తానని తెలియజేశారు. ఈ అవకాశం కల్పించిన ప్రజలకు, సహకరించిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లా జాతీయ ఉత్తమ కార్పొరేటర్‌గా అవార్డు అందించిన బహుజన సేవా సాహితి అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఏడవ డివిజన్ ప్రజలకు, తన గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు పేరుపేరునా పాదాభివందనాలు తెలిపారు.







