ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండు పెండింగ్ డీఏలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రెండు డీఏల విడుదల కోసం క్యాబినెట్ ఆమోదం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన పెండింగ్ డీఏల విడుదల కోసం నిన్న క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలను విడుదల చేస్తూ తీర్మానం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, మంచిర్యాల సాధన సభ్యులు శ్రీ గారికి, బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గార్లకు, తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ, గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
విచ్చిన్నంగా ఎవరికి వారే ఉన్నా సంఘాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చుకొని, సుమారు 210 సంఘాలతో ఒక గా నిర్మాణం చేసి, పటిష్టమైన నాయకత్వ లక్షణాలతో, చాణక్య నీతితో, గాంధేయ మార్గంలో క్షేత్రస్థాయిలో ఎన్ని నిందలు వచ్చినా భరిస్తూ సాధించిన ఈ విజయంలో కీలకపాత్ర పోషించి, కృషి చేసిన చైర్మన్ మరియు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ అన్నగారికి, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరు శ్రీనివాసరావు అన్నగారికి, టిఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ముజీబ్ అన్నగారికి, కృషి చేసిన నాయకత్వానికి యూనియన్ మంచిర్యాల జిల్లా సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మిగిలిన పెండింగ్ సమస్యలపైనా వెంటనే పరిష్కారం చూపిస్తారని, ప్రధానంగా పీఆర్సీ రిపోర్టును తెప్పించుకొని 51 శాతం ఫిట్మెంట్తో నూతన పేస్కేళ్లను అమలు చేయాలని, మిగిలిన పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు స్వాంతన చేకూర్చే విధంగా బిల్లులన్నీ మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం అమలు కోసం చర్యలు తీసుకోవాలని, హెల్త్ కార్డుల అమలులో తలెత్తుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు.
ఉద్యోగ సంఘాల జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు రెండు డీఏలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్ గారు, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య గారు, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు గారు, కోశాధికారి సతీష్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.











