Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 25
మనం నడవక ముందే దారులు వేసి, మన మౌనాన్ని అర్థం చేసుకుని, మన చిరునవ్వు కోసం కన్నీళ్లు దాచుకున్న అమ్మనాన్నలు ఈ జన్మకు మనకు దొరికిన అత్యంత గొప్ప ఆస్తిపాస్తులు. కాలంతో పాటు అన్నీ మారినా, వారి ప్రేమ, భరోసా మాత్రం ఎప్పటికీ మారవని రచయిత్రి మంజుల పత్తిపాటి తన రచన ద్వారా తెలియజేశారు.
మనం నడవక ముందే మన కోసం దారులు వేసినవారు, మనం మాట్లాడక ముందే మన మౌనాన్ని అర్థం చేసుకున్నవారు, మన చిరునవ్వు కోసం వారి కన్నీళ్లను దాచుకున్నవారు, మన కలలు నెరవేరాలని వారి కలలను పక్కన పెట్టినవారు, మనకు ఆకలి వేస్తుందని వారి ఆకలిని మరచినవారు... అమ్మనాన్నలు. మనం ఎత్తుకు ఎదగాలని కోరుకునే ముందు, మంచి మనిషిగా ఎదగాలని కోరుకునేవారు తల్లిదండ్రులు.
కాలం మారుతుంది, వయసు మారుతుంది, ప్రపంచం మారుతుంది. కానీ అమ్మ ఒడిలోని ఆప్యాయత, నాన్న చేతిలోని భరోసా ఎప్పటికీ మారవు. అయితే, మనం మారుతున్నాం. అమ్మనాన్నలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తూ జల్సాలకు అలవాటు పడి, వాళ్లకు కంటతడి పెట్టిస్తున్నాం.
రండి, మనం మారుదాం. మనం సంపాదించిన ఆస్తి అంతస్తుల కంటే, మంచి మనిషిగా ఎదగాలని చూపిద్దాం. అమ్మనాన్నలు ఈ జన్మకు మనకు దొరికిన అత్యంత గొప్ప ఆస్తిపాస్తులు. తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు.
రచన: మంజుల పత్తిపాటి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చరవాణి 9347042218.








