మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సాగరన్న మానవతా దృక్పథంతో స్పందించి, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి () ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
మండలం గూడెం గ్రామానికి చెందిన పంచర్పూల పోషయ్య అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల భారం కుటుంబ సభ్యులపై పడటంతో, ఎమ్మెల్యే సాగరన్న చొరవ తీసుకున్నారు. పోషయ్య వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి () నుండి రూ.5,00,000 విలువైన పత్రాన్ని మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే సాగరన్న కీలక పాత్ర పోషించారు. ఈ పత్రాన్ని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పోషయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే సాగరన్న నిరంతరం ప్రజల సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ సహాయం అందిస్తున్నారని తెలిపారు. పోషయ్య త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.












