2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికను ముమ్మరం చేసింది, నవంబర్ 26న 'సత్తాయిస్ కా సంకల్ప్: కా ప్రణ్పత్ర' పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
ఈ మేనిఫెస్టో రూపకల్పనలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సంక్షేమానికి సంబంధించిన హామీలతో పాటు ఉపాధి, విద్య వంటి కీలక రంగాలపై పార్టీ దృష్టి సారించనుంది.
మాజీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ పర్యవేక్షణలో ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంటే వెనుకబడిన తరగతులు (పిచ్డా), దళితులు, మైనారిటీలను సూచిస్తుందని, ఈ మూడు వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రస్థాయి మేనిఫెస్టోతో పాటు, ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను ప్రతిబింబించేలా ప్రత్యేక మేనిఫెస్టోలను కూడా విడుదల చేయాలని సమాజ్వాదీ పార్టీ యోచిస్తోంది. ఇది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ కార్యక్రమం అనంతరం, లక్నోలో రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ సంవిధాన్ మార్చ్ నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.





