మంచల్, 11 November
గంగపుత్ర జాతిపిత, మహనీయులు ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర గారి 115వ జయంతిని పురస్కరించుకుని జిల్లా తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించి, కులబంధువులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు, సభ్యులు ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర గారి 115వ జయంతి సందర్భంగా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గంగపుత్ర జాతిపిత, మహనీయులు ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర గారి 115వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి, యావత్ గంగపుత్ర కులబంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మన జాతి ఐక్యతకు, ఆత్మగౌరవానికి, అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకమని వారు అన్నారు.
ఆయన ఆశయాలే మన బాట జాతి ఐక్యతే మన లక్ష్యం గంగపుత్రుల అభ్యున్నతే మన సంకల్పం మన పిలుపుమన సంకల్పం అని వారు పేర్కొన్నారు. ఇది ఎవరో ఒకరి కార్యక్రమం కాదు, ఇది మన గంగపుత్ర జాతి కార్యక్రమం. ప్రతి గంగపుత్రుని బాధ్యత అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







