గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన యువతను కాపాడేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీపీ 15 రోజుల చికిత్సా కాలంలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు. వైద్య సిబ్బంది, బాధితుల్లో సత్ప్రవర్తన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అసాధారణ మార్పులు గమనించినట్లయితే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.
గంజాయి విక్రేతలు మరియు మత్తు పదార్థాల సరఫరాదారులపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు.












