మంచిర్యాల పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించి, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
శుక్రవారం, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీపీ మాట్లాడుతూ, 15 రోజుల చికిత్సా కాలంలో ప్రతి ఒక్కరిలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు. వైద్య సిబ్బందితో మాట్లాడిన ఆయన, గంజాయి బాధితుల్లో సత్ప్రవర్తన మరియు సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యుల పాత్ర ముఖ్యమని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించిన ఆయన, ప్రవర్తనలో లేదా శారీరక పరిస్థితిలో అసాధారణ మార్పులు గమనించినట్లయితే, స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
చికిత్స అనంతరం మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








