Mancherial/Jaipur (ప్రజావార్త) జూన్ 28
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా మండలంలోని నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాల వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆగిడి స్రవంతి లింగన్న, ఉప సర్పంచ్ రామగిరి వెంకటేష్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించారు.
జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాల వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆగిడి స్రవంతి లింగన్న, ఉప సర్పంచ్ రామగిరి వెంకటేష్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ స్రవంతి లింగన్న మాట్లాడుతూ.. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో రెండు చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా పిల్లలను పోలియో బూత్‌లకు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ తిరుమల దేవి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.











