మంచేరియల్, 2026-06-28
మంచిర్యాల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్యశాఖ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 76,367 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పోలియో చుక్కల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పురపాలక మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య , స్థానిక కార్పొరేటర్లు, మంచిర్యాల పురపాలక వార్డ్ కౌన్సిలర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అనిల్, డాక్టర్ అశోక్, డాక్టర్ సతీష్, ఆర్.ఎం.ఓ. డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డిపిఓ ప్రశాంతి, డి పి హెచ్ ఎన్ ఆర్ ఎస్ పద్మ, సిహెచ్ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రిలో ప్రసవమైన పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, ఇతర సంబంధిత విభాగాల సహకారంతో పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు 76,367 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలు కల్పించడంలో ముందుండాలని సూచించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి, జిల్లా వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, మందుల నిల్వ గిడ్డంగులు, క్రిటికల్ కేర్ ఆసుపత్రులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలందరూ, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో 76,367 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా 1836 మంది వైద్య సిబ్బంది (వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఎన్జీవోలు) సహకారంతో 70 వాహనాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొట్టమొదటిసారిగా ప్రతి సూపర్వైజర్, వైద్యాధికారి తమ పల్స్ పోలియో వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర పర్యవేక్షకుడు శ్రవణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనిల్, డాక్టర్ అరుణ శ్రీ, జిల్లా పల్స్ పోలియో డిస్ట్రిక్ట్ టీం సభ్యులు కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్. పద్మ, చారి, అఖిల్ పాషా, జిల్లా మాస్ మీడియా ప్రతినిధులు బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సిహెచ్ఓ శ్రీ నాందేవ్, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, డిపిఓ ప్రశాంతి, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో కూడా ఆరోగ్య కార్యకర్తల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.











