మంచేరియల్, 2026-07-27
మంచిర్యాల గోదావరి రోడ్డులో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావును కోరారు. ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు, వాచ్మెన్, స్వీపర్స్ వంటి జెట్సోర్సింగ్ ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గౌరవనీయులైన శాసనసభ్యులు, మంచిర్యాల నియోజకవర్గం, శ్రీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు గారికి మంచిర్యాల గోదావరి రోడ్డులో నూతనంగా నిర్మించబడి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో గర్పిళ్ల ప్రాంతానికి చెందిన స్థానిక నిరుద్యోగ యువతకు, మహిళలకు జెట్సోర్సింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించవలసిందిగా 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, ఆసుపత్రి ఆవరణలో స్థానిక మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించే విధంగా, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు వారికి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, ఆసుపత్రిలో అవసరమయ్యే వాచ్మెన్, స్వీపర్స్, ఇతర జెట్సోర్సింగ్ ఉద్యోగాలలో కాలేజీ రోడ్, గర్పిళ్ల ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని వినమ్రంగా విజ్జపై చేశారు.
స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపడటంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాబట్టే, తమ వినతిని సానుకూలంగా పరిశీలించి, స్థానిక నిరుద్యోగ యువతకు, మహిళలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన మనవి చేశారు.












