మంచేరియల్, 26.07.2026
మంచిర్యాల పట్టణంలోని 7వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, గ్రామ పంచాయతీ ప్రజల కోసం 26.07.2026 ఆదివారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. 7వ డివిజన్ కార్పొరేటర్ ఎల్పుల రవీందర్ ఆధ్వర్యంలో, అపోలో రీచ్ హాస్పిటల్, కరీంనగర్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు.
మంచిర్యాల పట్టణంలోని 7వ డివిజన్లో ప్రజలందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. ఆర్ 8 కాలనీ, శ్రీరాంపూర్ కాలనీ, భగత్ సింగ్ నగర్, కృష్ణమూర్తి నగర్, సుందరయ్య నగర్, ఇందిరా నగర్, సాయి బాబా టెంపుల్ ఏరియా, మరియు పాత సింగపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, రాబోయే ఆదివారం, అనగా 26.07.2026న ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు 7వ డివిజన్ కార్పొరేటర్ ఎల్పుల రవీందర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది.
ఈ శిబిరాన్ని కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కన్సల్టేషన్, జి.ఆర్.బి.ఎస్ (షుగర్), బి.పి, వెయిట్, ఈసీజీ (గుండె పరీక్ష), డైటీషియన్ కన్సల్టేషన్ వంటి సేవలతో పాటు ఉచిత మందుల పంపిణీ కూడా అందుబాటులో ఉంటాయి.
కావున, ప్రజలందరూ ఈ ఆరోగ్య శిబిరంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, ఈ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. ఈ శిబిరం ఆర్ 8 కాలనీ, మినీ గ్రౌండ్, భగత్ సింగ్ నగర్, శ్రీరాంపూర్ ప్రాంతాలలో జరుగుతుంది.












